మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Divakara Panchakam – శ్రీ దివాకర పంచకం
అతుల్యవీర్యముగ్రతేజసం సురం
సుకాంతిమింద్రియప్రదం సుకాంతిదమ్ |
కృపారసైకపూర్ణమాదిరూపిణం
దివాకరం సదా భజే సుభాస్వరమ్ || 1 ||
ఇనం మహీపతిం చ నిత్యసంస్తుతం
కలాసువర్ణభూషణం రథస్థితమ్ |
అచింత్యమాత్మరూపిణం గ్రహాశ్రయం
దివాకరం సదా భజే సుభాస్వరమ్ || 2 ||
ఉషోదయం వసుప్రదం సువర్చసం
విదిక్ప్రకాశకం కవిం కృపాకరమ్ |
సుశాంతమూర్తిమూర్ధ్వగం జగజ్జ్వలం
దివాకరం సదా భజే సుభాస్వరమ్ || 3 ||
ఋషిప్రపూజితం వరం వియచ్చరం
పరం ప్రభుం సరోరుహస్య వల్లభమ్ |
సమస్తభూమిపం చ తారకాపతిం
దివాకరం సదా భజే సుభాస్వరమ్ || 4 ||
గ్రహాధిపం గుణాన్వితం చ నిర్జరం
సుఖప్రదం శుభాశయం భయాపహమ్ |
హిరణ్యగర్భముత్తమం చ భాస్కరం
దివాకరం సదా భజే సుభాస్వరమ్ || 5 ||
ఇతి శ్రీ దివాకర పంచకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.